సాంప్రదాయ సంక్రాంతి సంబురాల్లో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉల్లాస భరిత వాతావరణంలో ప్రోకబడ్డీ పోటీ లు శంఖవరంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్, ఎంపీ పీ పర్వత రాజబాబు, ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం స్టేషన్ ఎస్ఐలు శోభన్ కుమార్, అజయ్ బాబులు స్వయంగా తిలకించారు. క్రీడాకారులను ఉత్సహాపరిచేందుకు ప్రతీ ఆటకూ తొలుత హెడ్ అండ్ టాస్ వేసి వారి ని ఉల్లాస పరిచడంతోపాటు క్రీడాకారులను పరిచియం చేసుకున్నారు.. ఈసందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, శంఖవరానికి పండుగ ముందే వచ్చిందనట్టుగా క్రీడా పోటీలను ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. పోటాపోటీగా ఆరు జట్లు తలపడ్డాయి. ఉపసర్పంచ్ చింతనీడి కుమార్, జట్ల అప్పారావు, గ్రామసచివాలయ మహిళా పోలీసులు, జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.