నేడు శంఖవరంలో జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు పర్యటన
Ens Balu
27
Sankhavaram
2023-01-13 04:56:40
శంఖవరం గ్రామంలో ఈరోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు పర్యటించనున్నారు. మండల కేంద్రంలో జరగనున్న సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో శంఖవరంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల ఫైనల్స్ ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీపీ పర్వత రాజబాబులతో అయన స్వయంగా తిలకించి విజేతలకు బహుమతి ప్రధానోత్స కార్యక్రమంలో పాల్గొంటారు. గత రెండు రోజులుగా శంఖవరంలో గ్రామంలో వాలీబాల్, ప్రో కబడ్డీ, రంగవల్లికల పోటీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాలను ప్రతిపాడు సీఐ కిషోర్ బాబు అన్నవరం ఎస్ఐలు శోభన్ కుమార్ అజయ్ బాబులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని గ్రామ సచివాలయ మహిళా పోసులు పాల్గొని కార్యక్రమాలను చేపడుతున్నారు.