సరదాల సంక్రాంతి శంఖవరం గ్రామానికి 2రోజులు ముందే వచ్చింది.. ఊరంతా రంగవళ్లులు.. మైదానాల్లో ఉల్లాస భరిత క్రీడలు.. చూడచక్కని పల్లె
వాతావారణంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. సాంప్రదాయ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శంఖవరం శ్రీవేంకటేశ్వరస్వామి
ఆలయం వెనుక ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాలు విశే షంగా ఆకట్టుకు న్నాయి. డూడూ బసవన్నలు, పిత్రు దేవతలను పొడిగే బుడబుడకల
జంగాలు..చిన్న పిల్లల కోలాటాలు, ఫ్యాన్సీ డ్రస్ షోలు, స్టేజి డాన్సులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మె ల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రాద్, ఎంపీపీ పర్వత
రాజబాబు, కుటుంబ సమేతంగా వచ్చి సందర్శించి మరీ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమాలను ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవ రం ఎస్ఐలు శోభన్ కుమార్,
అజయ్ బాబు, రౌతులపూడి ఎంపీడీఓ గోవింద్ లు దగ్గరుండి ర్యవేక్షించారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, గౌతమి,
నాగమణి, రజియా సుల్తానా, గ్రామసచివాలయ-1 కార్యదర్శి శ్రీరామచంద్ర మూర్తి, జేఏబీసీ రమణ మూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, జట్ల అప్పారావు,
స్వామి, ఉప సర్పంచ్ కుమార్, కార్య కర్తలు, గ్రామంలోని పెద్దలు, పెద్ద సంఖ్య లో వైఎస్సార్సీపీ కార్యక ర్తల, స్థానికులు పాల్గొన్నారు.