సంక్రాంతి అంటేనే బొమ్మల కొలువు గుర్తొస్తొంది. అలాంటి కొయ్యబొమ్మల కొలువును శంఖవరంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ పి.శోభన్ కుమార్ లు ప్రత్యేకంగా ఏర్పాటుచేయించారు. పిల్లలు, పెద్దలు చక్కగా తిలకించే విధంగా ఏర్పాటుచేసిన ఈ కొయ్యబొమ్మల కొలువులో మంచి మంచి బొమ్మలను ప్రదర్శనకు వుంచారు. జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు, ఎమ్మల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్, ఎంపీపీ రాజబాబు ఈస్టాల్ సందర్శంచి బొమ్మలకొలువు ను ఆశక్తిగా తిలకించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.