శంఖవరంలో నిర్వహించిన సాంప్రదాయ సంక్రాంతి సంబురాల్లో రౌతులపూడి ఎంపీడీఓ గోవింద్ ను జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు, ఎమ్మెల్యే పర్వతశ్రీ
పూర్ణచంద్రప్రసాద్ లు ప్రత్యేకంగా అభినందించారు. శంఖవరం మండలంపై అవగాహన లేకపోయినా.. శంఖవరం మండల గ్రామసచివాలయ
మహిళాపోలీసులను సమన్వయపరిచి, స్టాల్స్ ఏర్పాటు, స్టేజి, క్రీడలు, మహిళలతో వేయించిన ముగ్గులపోటీల విషయంలో చాలాచక్కగా వ్యవహరించారంటూ
అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా నువ్వేంటో తెలిసిందంటూ ఎమ్మెల్యే జిల్లాఎస్పీకి ఎంపీడిఓ గోవింద్ కోసం చెప్పిమరీ అభినందించడం విశేషం.