సింహాచలం గ్రామం, ఆయిల్ మిల్ ప్రాంతంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం గడచిన 39 ఏళ్ళుగా అనేక ఉత్సవాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతోంది. వినాయక దుర్గాదేవి, అమ్మవార్ల ఉత్సవాలతో పాటు భవానీమాత అగ్నిగుండం తొక్కే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ మిల్ ప్రాంతానికి చెందిన చిరకాల మిత్రులంతా ఆదివారం బైరవవాక వద్ద తోటలో కలుసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఈ సమావేశాని వచ్చి మిత్రులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 39 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ ప్రాయముగా నిలిచిందన్నారు. పాతతరం మిత్రులందరు ఒకేచోట కలుసుకోవడం అభినందనీమన్నారు.
భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని తామంతా నిర్ణయించుకున్నామన్నారు. మిత్రుల కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదామనీ అందరం కలిసి మెలిసి ఉండాలని అందరూ తమ ఆకాంక్ష వ్యక్తం చేశారని చెప్పారు. రానున్న రోజుల్లో పాత ,మధ్య ,నేటి తరం మిత్రులను కూడా సంఘంలో పూర్తిగా భాగస్వాములు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్రీను బాబు చెప్పారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ సాయంత్రము వరకు ఇక్కడే గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ మిత్రులు నాగు, అక్కిరెడ్డి అప్పలరాజు, గంట్ల కిరణ్ బాబు,కొల్లి చిన్న, సిడగం రాము, గండ్రెడ్డీ ఈశ్వర రావు, ప్రతాప్, ములకల పల్లి రాజు, నాని, జగదీశ్, కొల్లి శంకర్, మారుతి శ్రీను, శేఖర్ తదితర మిత్రులంతా పాల్గొన్నారు.