ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాలను సాధించాలనుకుంటున్నవిద్యార్థులకు తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈనెల 29న ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్టు
సంస్థ నిర్వాహకులు జి.సాయిరాం ఒకప్రకటనలో తెలియజేశారు. పరీక్షను విశాఖలోని సంపత్ వినాయక టెంపుల్ పక్కన గోఠీ సన్స్ వెనుక ఉన్న తక్షశిల
క్యాంపస్ లో నిర్వహిస్తున్నామన్నారు. ఈపరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, ప్రధమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.25వేలు, తృతీయ
బహుమతి రూ.15వేలు నగదు ప్రోత్సాహంగా ఇస్తామన్నారు. ప్రతిభ చూపించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఈఏడాది 10వ తరగతి
చదువుతున్న, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ టెస్ట్ రాసేందుకు అర్హులన్నారు.మరిన్ని వివరాలకు
9965 252 252 , 9965 262 262 లో సంప్రదించాలని కోరారు.