నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని ప్రతీ ఒక్కరూ అలవరుచుకోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన 126 జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతని కుటుంబంపై కూడా గూఢచర్యం చేశారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుని 126వ జయంతిని పురస్కరించుకుని అండమాన్ దీవుల్లో నేతాజీ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిపాదిత స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి తదితరులు పాల్గొన్నారు.