నెలంతా పనిచేసినా తమకు సకాలంలో జీతాలు రాకపోతే తాము ఎలా బ్రతకాలని 108 అంబులెన్సు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చింతపల్లిలో తమ డిమాండ్ల సాధన కోసం జీతాల కోసం ఉద్యమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో 26 108 అంబులెన్సుల్లో 65 మంది ఈఎంటిలు, మరో 65 మంది పైలెట్లు సేవలందిస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెల వేతనాలు ఇంకా జమ కాలేదు. దీనితో జీతాలకోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ డిమాండ్ల సాధనకు విధులు నిర్వహిస్తూనే మండలాల వారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.