బాలికల సంరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని శంఖవరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లిపూడి సచివాలయంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లను ప్రతీ ఇంట్లో మహలక్ష్మిలా చూసుకోవాలన్నారు. సచివాలయ కార్యదర్శి దుర్గాదేవి మాట్లాడుతూ, ఆడిపిల్లపై వివక్ష చూపకూడదని సూచించారు. గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి మాట్లాడుతూ, పోలీసుశాఖ పరంగా బాలికలకు, మహిళలకు కల్పిస్తున్న రక్షణ వ్యవస్థల కోసం వివరించారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న అసమానతలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సత్యన్నారాయణ, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.