అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయ పట్టణ పరిసర ప్రాంతం అంతా మంచు దుప్పటి కప్పుకుంది. గత రెండు రోజుల
నుంచి దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉదయం 10 గంటల వరకూ ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలు దాటిన సూర్యుడు
కనిపించడం లేదు. మంచుతోపాటు చలిగాలుల ప్రభావంతో మండలంలోని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ పట్టణ
పరిసర ప్రాంతంలో వారం రోజులుగా ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ లాడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం
సాయంత్రం గిరిజనులు చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఈనెల చివరి వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని ఆయా గ్రామాల
గిరిజనులు చెబుతున్నారు.