విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల గతంలో ఈనెల 30వ తేదీన ఉక్కు ప్రజాగర్జన సభ స్టీల్ ప్లాంట్ వద్ద నిర్వహించనున్నారు. ఈ సభకు మద్దతు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జే.అయోధ్యరామ్ కోరారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో కార్మిక సంఘాల నాయకులు మంత్రి అమర్నాధుని కలిశారు. మంత్రిని కలిసిన వారిలో వి.శ్రీనివాసరావు, బొడ్డు పైడిరాజు, దాలినాయుడు తదితరులు ఉన్నారు.