విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా వచ్చే ఎన్నికల్లో రెప రెపలాడాలని ఉత్తరాంధ్రా జిల్లాల ఇన్చార్జి, టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం రాజాంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 175 స్థానాల్లోనూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని..దానికో కార్యకర్తలంతా పార్టీ ని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఎంపీ చంద్రశేఖర్రు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.