ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్నారని. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ ఆరోపించారు. మంగళవారం విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో 2,30,000 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని మోసం చేయడమా సీఎం జగన్ మోహనరెడ్డి విశ్వసనీయతా? కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేయడం విశ్వసనీయతా? అని ప్రశ్నించారు. నేటికీ జాబ్ కేలండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఏకైన ముఖ్యమంత్రి జగన్ అనే విషయాన్ని ప్రజలు, యువత గుర్తుపెట్టుకున్నారని దుయ్యబట్టారు.