విశాఖజిల్లా గ్రంధాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆసంస్థ ఛైర్పర్సన్ కొండా రమాదేవి శుభవార్త చెప్పి.. పదేళ్ల తరుబడి పెండింగ్ లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల పై కూడా ఉత్తరువులు జారీచేసి ఇద్దరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. రామా టాకీస్ వద్ద గల జిల్లా గ్రంధాలయ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగస్తులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ రమాదేవి ఉద్యోగస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.