ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ పథకానికి విరాళాలిచ్చి క్షయ రోగులకు చేయూత నివ్వాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 40 మంది టీ.బి రోగులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు కావలసినది మందులు పౌష్టికాహారమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. 476 మంది టీ.బి రోగులను దత్తత తీసుకున్న హెటిరో ఫౌండేషన్ ను కొనియాడుతూ.. టీబీవ్యాధి రోగులు కోలుకునేందుకు సహాయం చేసేందుకు మరిన్ని సంస్థలు ముందుకి రావాలన్నారు.