గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన ద్వారా అభివృద్ధికి నిజమైన సారధిగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం కనిమెట్ట గ్రామపంచాయతీ పరిధిలో రామదాసు పురం గ్రామంలో సుమారు 73 లక్షల నిధులతో, రాపాక పంచాయతీ పరిధిలోని ఇళ్లయ్య గిరిపేట గ్రామంలో సుమారు 55 లక్షల నిధులతో సిసి రోడ్డుl పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వివరించారు.