ఓటు యొక్క పవిత్రను అందరూ గ్రహించాలని మండల శంఖవరం తహశీల్దార్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నెల్లిపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ఓటుతోనే నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అవకాశం వుంటుందన్నారు.18ఏళ్లు నిండినవాంతా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఓటరు దినోత్సవరం సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరాల శ్రీనివాస్, సచివాలయ మహిళా పోలీస్ కళాంజలి, కార్యదర్శి దర్గాదేవి, వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు, గ్రామ పెద్దలు, స్కూలు పిల్లలు పాల్గొన్నారు.