ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు ఒక్కటేనని శంఖవరం తహశీల్దార్ సుబ్రహ్మం పేర్కొన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, సామాన్యుడు సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క ఓటుతోనే సాధ్యపడుతుందని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఓటరుగా నమోదు కావాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఓటరు నవీకరణను కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవలని సూచించారు. అనంతరం సిబ్బంది, గ్రామ పెద్దలతో ఓటరు దినోత్స ప్రతిజ్ఞను చేయించారు. ఈకార్యక్రమంలో డిటీ దుర్గాప్రసాద్, ఆర్ఐ రేవతి, సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, బూత్ లెవల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.