భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రతిభ అవార్డుకు శంఖవరం మండల ఉత్తమ గ్రామసచివాలయ మహిళా పోలీస్ గా పిఎస్ఎస్ కళాంజలి ఎంపికయ్యారు. శంఖవరం మండల కేంద్రంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ఈఅవార్డును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణ చంద్రప్రసాద్ ద్వారా స్వీకరించనున్నారు. ఈమెకు అవార్డు రావడంపట్ల సహచర మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, నాగమణి, గౌతమి, చిన్నారి, రజియాసుల్తానా, సచివాలయ కార్యదర్శి కనకదుర్గ, వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావులు అభినందించారు.