ఐసీడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శంఖవరం సీడీపీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వీడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్ అటెండెన్సు యాప్ రద్దు చేయాలని, సభలు సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునే జీఓనెం-1ని రద్దుచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలనే 13 డిమాండ్ లతో నిరసన చేపట్టారు. ఫిబ్రవరి 6వ తేదీన కలెక్టరేట్, పీడి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఇన్చార్జి సిడిపీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.