సచివాలయ మహిళా పోలీస్ కళాంజలికి ఎమ్మెల్యే ప్రశంస


Ens Balu
27
Sankhavaram
2023-01-26 10:23:55

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగులు ప్రజలకు అందించిన ఉత్తమ సేవలే ప్రజలు గుర్తించి పేరు తెచ్చేలా చేస్తాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. గురువారం శంఖవరం మండల కాంప్లెక్స్ లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగాజెండా ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో ఉన్నత సేవలు అందించిన నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్.కళాంజలిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం పూర్తిస్థాయిలో తీసుకురావడానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగులు మరింత ఉన్నతంగా పనిచేసి ప్రజలకు సేవలందిస్తూ.. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ పర్వతరాజబాబు తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు