శంఖవరం మండల కాంప్లెక్స్ లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు ఎంపీపీ పర్వత రాజబాబుతో కలిసి పూలమాలలు వేసి అనంతరం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకొని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందకి ఎమ్మెల్యే ఉత్తమ అవార్డులు, ప్రసంశా పత్రాలను అందజేశారు. విద్యార్ధులు శతశాతం మార్కులు సాధించడానికి ఉపయోగపడే స్టడీ మెటీరియల్ ను ఎమ్మెల్యే విద్యార్ధులకు అందజేశారు. తదుపరి వర్మీ కంపోస్టు సేల్ పాయింట్ ను ప్రారంభించారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ టి.మల్లేశ్వరి, వైఎస్సార్సీ నేత లచ్చబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు,ఎంఈఓ ఎస్వీరమణ తదితరులు పాల్గొన్నారు.