నక్కపల్లి టోల్ ప్లాజాకి శుక్రవారం యముడు వచ్చాడు..ఏంటి నిజమైన యముడు అనుకుంటున్నారా..ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు హైవే టోల్ ప్లాజా సిబ్బంది వినూత్నంగా ఆలోచించి వాహనదారులను చైతన్య పరిచారు. హెల్మెట్లు ధరించకుండా బైక్ లు నడిపే వారికి వినూత్న రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, యమధర్మరాజు వేషధారణలో ప్రజలకు వేంపాడు హైవే టోల్ ప్లాజా మేనేజర్ చిరంజీవి నాయుడు, ప్రాజెక్ట్ మేనేజర్ రజనీకాంత్, అశోక్ కుమార్ లు అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.