పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని విశాఖ32వ వార్డు కార్పొరేటర్ కందులనాగరాజు తెలిపారు. శుక్రవారం అల్లిపురంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన వార్డు కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే తాను జనసేనలో చేరినట్లు పేర్కొన్నారు. తాను దక్షిణ నియోజ కవర్గంలో పలు సేవాకార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తనకు వార్డులో, అలాగే నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ నియో జకవర్గం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న వర్గపోరు వలన పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందనన్నారు. ఆపార్టీలో నియోజక వర్గంలోని కార్పొరేటర్లందరూ వర్గాలుగా విడిపోయారని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కె. ఎన్. ఆర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.