కాకినాడ 7, 8వ డివిజన్ల పరిధిలోని కొత్త కాకినాడ ప్రాంతంలో గురువారం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మూడున్నరేళ్ళ పాలనలో ప్రభుత్వం అందించిన నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్నసాగర్, కమిషనర్ కే. రమేష్. అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పలువురు అధికారులు, మాజీ కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వo అందిస్తున్న సంక్షేమ పథకాలను సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్ల వ్యవధిలో 87% హామీలను అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు, ఇటువంటి ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు పసుపులేటి వెంకటలక్ష్మి,మీసాల ఉదయ్ కుమార్, , మాజీ కార్పొరేటర్లు చిట్నీడి మూర్తి, సంగాని నందం,రోకళ్ళ సత్యనారాయణ, శిగల మధు, స్థానిక నాయకులు తొంపల తాతారావు, బత్తిన రాజు, నందకుమార్, తదితరులు పాల్గొన్నారు.