జగనన్న ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో శనివారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ సీఎం వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భిణీల సీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొని గర్భిణీలకు నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ అందజేసి ఆశీర్వదించారు.