పవిత్ర మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి పర్వదిన సందర్భంగా శ్రీ శంకర మఠం నిర్వహణలో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద శనివారం సూర్యారాధన నిర్వహించారు. రుత్విక్కులు, వేద పండితులు, వేద విద్యార్థులు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అరుణ పారాయణం, మహాసౌరం, సూర్య నమస్కా రాలు సమర్పించారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సముద్రతీరంలో అర్ఘ్యప్రదానాలు అర్పించి, భక్తులకు అనుగ్రహ భాషణం గావించారు. కార్యక్రమంతో శంకరమం పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.