కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ శనివారం పండూరు-1 లేఔట్ ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 1,2,3 డివిజన్లకు సంబంధించి 1086 మంది లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ళ నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, హౌసింగ్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ లేఔట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ మాట్లాడుతూ పండూరు లే అవుట్ లో రహదారులు,డ్రైనేజీలు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సుమారు 800 మంది ఇళ్ల నిర్మాణానికి ఆమోద పత్రాలు కూడా ఇచ్చారన్నారు. ముఖ్యంగా ఉగాది నాటికి కనీసం 50 ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ చౌదరి, కాకినాడ నగరపాలక సంస్థ డిఈ ఎం. వెంకట్రావు, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, ఏ ఈ రమేష్, హౌసింగ్ ఏఈ భాష, తదితరులు పాల్గొన్నారు.