సింహగిరిపై వైభవంగా రథసప్తమి పర్వదిన వేడుకలు


Ens Balu
24
Simhachalam
2023-01-28 14:56:02

సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో శనివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్దముగా నిర్వహించే ఈఉత్సవాన్ని ఈఏడాదికూడా వైభవంగా జరిపించారు. సింహాద్రి నాధుడిని సర్వాభరణాలతో సూర్య భగవానుడిగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవితో కలిసి వేదమంత్రోచ్ఛరణలు, మృధు మధుర మంగల వాయిద్యాలు నడుమ ఆలయ హంస మూలన ఉన్న రాతిరథంపై ఆసీనులు చేశారు. విశ్వక్సేన పుణ్యహవచనం ఆరాధన, అరుణ పారాయణంతో పాటు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం అక్కడే సింహాద్రి నాధుడు నిత్య కళ్యాణం ఘనముగా జరిపించారు. ఏఈఒ నరసింహరాజు పర్యవేక్షణలో..సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు.. ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కొండ దిగువన గోశాలలో
ఉన్న  సూర్య భగవానుడు విగ్రహం వద్ద ఆలయఅర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఏఈఓలు నరసింహారాజు వై.శ్రీనివాసరావు జంగం శ్రీనివాసు, పర్య వేక్షకులు పిల్లా శ్రీనువా సరావు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సిఫార్సు