అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి చిన్నకోనల గ్రామ అటవీ ప్రాంతంలో కోటపర్తి. గంగులు అనే రైతుకు చెందిన పశువులు ఆదివారం ఉదయం అడవికి మేతకు వెళ్లి పెద్దపులి దాడిలో మృత్యువాత పడ్డాయని తెలియజేశారు. ఈ నెల 3న చిన్నకోనల అటవీ ప్రాంతంలో 3 లేగ దూడలు మేతకు వెళ్లినపుడు కూడా పులిబారిన పడ్డాయని గ్రామస్తులు పేర్కొన్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు స్పందించి పెద్దపులి భారి నుంచి తమను తమ పశువులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పులి దాడిలో పశువులను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించాలని చిన్నకోనల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.