వైఎస్.జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యంవివి. ప్రసాద్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆదివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం కంఠారం, బాలారం, పంచాయితీల్లో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనారోగ్యం తో బాధపడుతున్న టిడిపి సీనియర్ కార్యకర్త నిమ్మల. నాగేశ్వరరావును నేతలు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాలారం సర్పంచ్ అప్పన అప్పలనర్స, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి బొర్రా విజయరాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుచ్చరి చిట్టిబాబు, మాజీ జెడ్పిటిసి గాడి. శ్రీరామమూర్తి, ఉండా. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.