కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు సోమవారం తిమ్మాపురం నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శిరిడి సాయి బాబా గుడివెనుక గల ప్రభుత్వం మంజూరు చేసిన 28సెంట్లు భూమిని పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణని కి పోలీస్ హౌసింగ్ బోర్డు ఎఇ. షేక్ వలితో చర్చించి తగినసూచనలు చేశారు. ఎస్పీ వెంట ఎస్.బి. డి.ఎస్.పి. ఎ.అంబికా ప్రసాద్, కాకినాడ ఎస్ డిపిఓ పి.మురళీ కృష్ణారెడ్డి, కాకినాడ రూరల్ సి ఐ, తిమ్మాపురం ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.