మార్చికల్లా టిడ్కో గృహాలు లబ్దిదారులకు అప్పగింత


Ens Balu
9
Kakinada
2023-01-30 12:28:33

టిడ్కో గృహాలను మార్చి కల్లా అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్పొరేషన్, హౌసింగ్, విద్యుత్,అధికారులతో కలిసి టిడ్కో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్, కమిషనర్‌ కె.రమేష్, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి టిడ్కో ఇండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. అక్కడ కల్పిస్తున్న మౌళిక సదుపాయలను అడిగి తెలుసుకున్నారు. పనులు మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

 పనుల ప్రగతిపై ఎమ్మెల్యే ద్వారంపూడి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడ్కో మొదటి దశలో 1152 ఇండ్లను మార్చి మొదటి వారానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో రెండునెల వ్యవధిలో ఫేజ్‌–2 ఇళ్ళను కూడా పూర్తి చేస్తామన్నారు. తొలి విడత టిడ్కో లబ్థిదారులు ఏప్రిల్‌ మొదటి వారానికల్లా గృహప్రవేశాలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యకుమారి, టిడ్కో ఈఈ రీటా, వ్యవసాయ మార్కెట్‌కమి టీ డైరెక్టర్‌ వాసుపల్లి కృష్ణ, స్థానిక నాయకులు మట్టపర్తి రఘురామ్, ఎరుపల్లి సీతారామ్, మోసా పేతూరు తదితరులు పాల్గొన్నారు.


సిఫార్సు