కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కేఎస్‌పీఎల్– కోరమండల్‌కు సంబంధించిన పైపులైన్‌ను ఎమ్మెల్యే ద్వారంపూడి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గతంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో వేసిన పైపులైన్లు వల్ల వర్షపునీరు వెళ్ళేదారి లేక పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పారు. ఈ నేపద్యంలో అక్కడ పైపులైన్‌లు తొలగించి కల్వర్టులు నిర్మించాల్సిందిగా కేఎస్‌పీఎల్‌సంస్థను కోరామన్నారు. ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేఎస్‌పీఎల్ అవసరమైన అనుమతులు తీసుకుని కల్వర్టులు నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే సాంబమూర్తినగర్, రేచర్లపేట, పల్లంరాజునగర్ ప్రాంతాలకు ముంపు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి దీప్తికుమార్, మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్, కేఎస్‌పీఎల్ సీవోవో మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.