అత్యవసర వైద్యసహాయం కోరే నిరుపేద రోగులకు డా.బిబిఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కేజిహెచ్ ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందించే ఏర్పాటు చేస్తామని..కెజిహెచ్ మాజీ ఆర్ఎంఓ, ప్రముఖ వైద్యులు, డా.బిబిఆర్ ట్రస్టుల నిర్వాహకులు డా.బంగారయ్య పేర్కొన్నారు. సోమవారం కోటఉరట్ల మండల కేంద్రం లో ఉన్న సామజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి తో కలిసి వార్డులో ఉన్న పెషేంట్లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ, అత్యవసరం అయిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేదలైనవారి వివరాలు తెలియజేస్తే విశాఖ కెజిహెచ్ కి పంపిస్తే డాక్టర్ బిబిఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం అందిస్తామని వైద్యాధికారికి తెలియజేశారు. ట్రస్టు సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట చంటి, సతీష్, నానాజీ, అప్పారావు, రవి, శ్రీను, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.