కరోనా సమయంలో మృత్యువాతకు గురై నేటికీ ప్రభుత్వం అందించే రూ.50 వేలు పరిహారం పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మాడుగుల తహసీల్దార్ పివి.రత్నం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోదలచిన వారు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యత్వపత్రం, జత చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తహశాల్దార్ కార్యాలయంలో సిబ్బంది తెలియజేస్తారన్నారు.