ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ స్టాండర్డ్స్ మరింతగా మెరుగుపరచాలని కరప మండల విద్యాశాఖ అధికారిణి కె.బి.క్రిష్ణవేణి పేర్కొన్నారు. మంగళవారం మండల కాంప్లెక్స్ లో 65 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్స్ అప్డేషన్, నాడు, నేడు, సిలబస్ కంప్లీషన్, వర్కుబుక్ కంప్లీషన్ తదితర అంశాలపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిస్ కోఆర్డిరేటర్లు, ప్రధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు ఏఈ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.