పొలంబడిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి


Ens Balu
18
కె.కోటపాడు
2023-01-31 14:26:56

రాష్ట్రప్రభుత్వం దిగుబడులను పెంచే లక్ష్యంతో రైతులకు యాజమాన్య పద్దతులపై నిర్వహించే డా.వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాన్ని రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ ఆఫీసర్ మధు పేర్కొన్నారు. మంగళవారం కె.కోటపాడు మండలం వారడ గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో పాటిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం పొలం బడి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.  జిల్లా పొలంబడి కోఆర్డినేటర్ చిరంజీవి, అనకాపల్లి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రదీప్, అనకాపల్లి డిఆర్సి ఏవో తులసీమణి, అగ్రీ అసిస్టెంట్ పూజిత కళ్యాణి పాల్గొన్నారు.
సిఫార్సు