శంఖవరం మండలంలో ఐదు గ్రామాల్లో రీసర్వే


Ens Balu
9
Sankhavaram
2023-01-31 14:32:24

శంఖవరం మండలంలో ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని పెద్దాపురం ఆర్డీఓ సీతారామ్ తెలియజేవారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలో ఆయన తహశీల్దార్ సుబ్రహ్మణ్యంతో కలిసి  సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. అన్నవరం, ఆరెంపూడి, కత్తిపూడి, వెంకటాపురం, జగ్గంపేట ప్రాంతలో ఈ సర్వే జరుగుతుందన్నారు. మండల సర్వేయర్లతోపాటు తుని నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు. నాలుగు గ్రామాల్లో గ్రౌండ్ స్క్రూట్నీ దశలో ఉన్నాయని అన్నవరంలో మాత్రం గ్రౌండ్ వేలిడేషన్ దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. 

సిఫార్సు