అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మంగళవారం జరిగిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రకటించారు. చింతపల్లి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు దయానంద్, చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేష న్ అధ్యక్షుడుగా వనరాజులు ఉన్నారు. అంతకు ముందు ఏపీయూడబ్ల్యూజే చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ చింతపల్లి ఏరియా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, మాజీ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు చందర్రావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ చింతల కిషోర్, జిల్లా అధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.