అరకువేలికి ఆర్టీసీబస్సు సౌకర్యాలను మెరుగుపరచాలి


Ens Balu
5
Araku Valley
2023-02-01 04:44:06

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకువేలి పేరుకే పార్లమెంటు నియోజకర్గంగా మాత్రమే ఉందని..ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు పూర్తిస్థాయిలో బస్సుసౌకర్యం కూడా లేదని జనసేన అరకువేలి పార్లమెంటు ఇన్చార్జి వంపూరు గంగులయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం అరకులోయలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో అరకువేలి ప్రాంతం పర్యాటప్రాంతంగా మరింతగా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం వుందన్నారు. తద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి విరివిగా రావడానికి ఆస్కారం వుంటుందని, స్థానిక నిరుద్యోగ గిరిజనులకు కూడా ఉపాది దొరుకుతుందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి నిత్యం గిరిజన రైతులు కూరగాయలు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలకు సరఫరా చేయడానికి కూడా ఆస్కారం వుంటుందన్నారు. ఈ విషయమై త్వరలోనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ని కలిసి రవాణా పరిస్థితిని తెలియజేస్తానని వివరించారు. ప్రభుత్వం ఈ ప్రాంత గిరిజనుల సౌకర్యార్ధం రవాణా విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గంగులయ్య డిమాండ్ చేశారు.
సిఫార్సు