నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామం పెద్దవీధిలో మురుగునీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చేస్తామని తహసిల్దార్ నీరజ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలోని మురుగునీటి పరిష్కారం కోసం తక్షణమే సర్వే చేయమని సర్వేయర్ ను ఆదేశించినట్టు తెలిపారు. పెద్ద వీధిలో ఆక్రమణలకు గురైన గ్రామకంఠం భూమిని గుర్తించేందుకు సర్వే చేయమని డిపివో ఆదేశించినట్టు వివరించారు. సర్వే జరిపి నివేదికను కలెక్టర్, డీపీవోకు అందజేస్తామని తహసిల్దార్ నీరజ చెప్పారు. సర్వే అనంతరం ఎంత మేర ఆక్రమణలున్నాయో నివేదికలో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.