గ్రామ సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులు ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తుని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పిఎన్వి.సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీచేశారు. నవరత్నాల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వపథకాల లబ్దిదారుల జాబితా, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్ నోటీసు బోర్డుల నిర్వహణను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. అర్జీదారుల నుంచి వస్తున్న సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిస్కారంకోసం జిల్లాకేంద్రానికి పంపిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రికార్డులన్నీ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఆయనతోపాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.