జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం క్రింద చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే. రమేష్ కోరారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం అడ్మిన్ సెక్రటరీలు, ప్లానింగ్ కార్యదర్శులు, రెవెన్యూ సెక్రటరీలతో ఈ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి డి ఎం ఏ నుంచి 16ఎ ఫార్మేట్ లో వచ్చిన ఆదేశాల అమలుపై సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా అసెస్మెంట్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సర్వే నెంబర్ కు అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను 15 రోజుల వ్యవధిలో పూర్తిచేసేలా సిబ్బంది, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ సర్వే వల్ల ఎన్నో భూ వివాదాలకు, సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అర్బన్ రీసర్వే ప్రక్రియను అత్యంత ప్రణాళిక బద్దంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, ఏసీపి నాగశాస్త్రులు, టౌన్ సర్వేయర్ ఆచారి, ఆయా సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.