ప్రజలకు చేరువయ్యేందుకే గడపగడపకూ ప్రభుత్వం


Ens Balu
23
Kakinada
2023-02-02 13:17:02

కాకినాడ 7వ డివిజన్‌లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురువారం  గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. రేచర్లపేట లో ఈ కార్యక్రమాన్ని  ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గడపగడపకు ప్రభుత్వం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారన్నారు.  ప్రజలు చెప్పిన సమస్యలను ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా ప్రతి సచివాలయానికి  20 లక్షల రూపాయలు చొప్పున నిధులు కూడా ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన ఇటువంటి ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగితేపేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, పలువురు అధికారులు,  నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిఈ మాధవి, ఎంహెచ్‌వో డాక్టర్‌ ఫృద్వీచరణ్, టి పి ఆర్ ఓ మానే కృష్ణమోహన్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి తొంపల తాతారావు, మాజీ కార్పొరేటర్‌లు నల్లబిల్లి సుజాత, కర్రిశైలజ, సిగల మధు, స్థానిక నాయకులు బత్తినరాజు, నందకుమార్,  దౌర్ల సుశీల తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు