చెత్త నుంచి నుంచి తయారు చేసిన కంపోస్టు ఎరువును సంపదగా మార్చే కార్యక్రమానికి శంఖశరం గ్రామసచివాలయం శ్రీకారం చుట్టింది. మండల కేంద్రంలోని చెత్త నుంచి సంపద కేంద్రాల ద్వారా తయారు చేసిన కంపోస్టు ఎరువును కిలో రూ.10 చొప్పున అమ్మాలు చేస్తున్నట్టు సచివాలయ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, రైతులు, గృహాల్లో పెరటి తోటలు పెంచేవారికి ఈ ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వానపాముల ద్వారా తయారుచేసిన ఈ ఎరువుల ద్వారా భూమికూడా సారవంతం అవుతుందని, సేంద్రియ వ్యవసాయానికి చక్కగా పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఎంతమేరకు ఎరువు కావాలన్నా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నామని మూడు సచివాలయాల్లో వీటని అందుబాటులో ఉంచామన్నారు. సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జెఏబీసి రమణమూర్తి, సచివాలయ వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు.