ఆపరేషన్ పరివర్తన 2.0 జీవితాలను మారుస్తోంది


Ens Balu
55
Nellipudi
2023-02-02 14:24:25

గతంలో నాటుసారా వ్యాపారాలు చేసి మానేసిన వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన జీవనోపాది పథకం ద్వారా బాధితుల జీవితాలు మెరుగు పడుతున్నాయని ప్రత్తిపాడు ఎస్ఈబీ సిఐ పి.అశోక్ అన్నారు. ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా శంఖవరం మండలం నెల్లిపూడి పంచాయతీలో గురువారం పిల్లా జనార్ధనరావు అనే పాత సారావ్యాపారస్తుడు కొత్తగా ప్రారంభించిన ఉపాది యొక్క స్థితిగతులను మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నరాల శ్రీనివాసరావు, సచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్.కళాంజలితో కలిసి నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, శంఖవరం మండలంలో ఇద్దరు సారావ్యాపారులకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేసిందన్నారు. వాటితో వారంతా పాత వ్యాపారాలకు స్వస్థి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. నెల్లిపూడిలోని నేరస్తుడు కూడా కొబ్బరి నూనె వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడని తెలియజేశారు. అదేవిధంగా నాటుసారా వ్యాపారాలు చేసేవారు కూడా ఈయనలా మార్పుతెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఓ.దుర్గాదేవి, గ్రామ పెద్దలు నరాల తాతబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు