మాఘపౌర్ణమి తీర్ధమహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏఎస్పీ కె.ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. యస్.రాయవరం మండలం రేవుపోలవరంలో ఆదివారం జరిగే మాఘాపౌర్ణమి సందర్భంగా ఏఎస్పి సీఐ నారాయణరావు రేవుపోలవరం
తీరాన్ని స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, భక్తులకు ప్రమాదవసాత్తు సముద్రంలోకి వెళ్లినా ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్ళు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొత్త రేవుపోలవరం సర్పంచ్ మల్లె లోవరాజు, సోషల్ మీడియా కన్వీనర్ చేపల రాజు, పంచాయతీ సెక్రటరీ లక్ష్మణరావు పాల్గొన్నారు.