ఎస్టీలోకి బోయ, బెంతుల చేర్పులను అడ్డుకుంటాం


Ens Balu
33
పాడేరు
2023-02-04 02:56:54

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభా కలిగిన బోయా, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటి కుతంత్రాలు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని జనసేన అరకు పార్లమెంటు ఇన్చార్చి వంపూరు గంగులయ్య హెచ్చరించారు. శనివారం అల్లూరి జిల్లా పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో జి.ముంచంగిపుట్టు, పంచాయితీ కావురాయి,లింగపుట్టు గ్రామాల యువతతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు ద్రోహంచేసే ఎలాంటి చర్యలనైనా జనసేన అడ్డుకుంటుందన్నారు. గిరిజన వ్యతిరేక చర్యలను మానుకోవాలని లేదంటే యావత్ గిరిజన జాతి దృష్టిలో జాతి ద్రోహులుగా మిగిలి పోతారన్నారు. తాత్కాలిక అవసరాలకోసం జాతి మనుగడ దెబ్బతీసే వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు.

 అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగంపై కూడా గిరిజన యువతకు గంగులయ్య వివరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజరవాన వ్యవస్థ,ప్రజారోగ్యవ్యవస్తా,విద్యాశాఖ హాస్టల్ వసతి నిర్వహణ వ్యవస్థ,ఉపాధి కల్పన వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో మనం వెనక బాటుకు గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారతను బలంగా కోరుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, జనసేపార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఏజెన్సీలో అభివృద్ధిం అంటే ఏమిటో చేసి చూపిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాడేరు మండలఅధ్యక్షులు నందోలి మురళి కృష్ణ,సీదారి సన్నిబాబు,సాలేబు అశోక్ కొర్ర రాంబాబు,మాదేలి నాగేశ్వరరావు,వంతల ఈశ్వర్ నాయుడు,సోమరాజు జి.మాడుగుల  నాయకులు మసాడి సింహాచలం,తల్లే త్రీమూర్తులు,టీవీ రమణ ,చందు తదితర జనసైనికులు పాల్గొన్నారు.
సిఫార్సు